ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీని ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ చర్చలు మాత్రం దాదాపు పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే రోజు మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ ఓ స్పెషల్ ట్వీట్ చేసింది. మరికొన్ని గంటల్లో స్పెషల్ బ్లాస్టింగ్ అప్ డేట్ ఉంటుందని వేచి ఉండాలంటూ ఓ ట్వీట్ వేసింది. మాస్, మ్యాజిక్ కలిస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ ఆ ట్వీట్ లో ఉంది.
ఈ ట్వీట్ బన్నీ, అట్లీ సినిమాకు సంబంధించిందే. ఈ ట్వీట్ తో మూవీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ సినిమాను బన్నీ బర్త్ డే రోజు ప్రకటించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ను ఓ వీడియో రూపంలో ప్రకటించబోతున్నారు. బన్నీ, అట్లీ, కళానిధి మారన్ చర్చిస్తున్న గ్లింప్స్ తో పాటు అమెరికాలో మూవీ టీమ్ వీఎఫ్ ఎక్స్ వర్క్ కోసం పలు కంపెనీలతో చర్చించిన గ్లింప్స్ ను కూడా ఈ వీడియోలో చూపించబోతున్నారంట. చాలా కొత్తగా మూవీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బన్నీ రెండు పాత్రల్లో నటిస్తారని సమాచారం. జవాన్ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా భారీ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.