విజయవాడలో వచ్చిన వరదలకు సింగ్ నగర్, ఆ చుట్టు పక్క పలు ప్రదేశాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఇళ్లన్నీ నీళ్ళల్లో మునిగిపోయి అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది. ప్రజలు ఫుడ్, నీళ్లు, పాలు అత్యవసర వస్తువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో పాటు పలు NGO సంస్థలు, పలువురు ప్రముఖులు వారికి ఫుడ్, వాటర్ లాంటివి అందిస్తున్నారు. ఈ క్రమంలో హీరో సందీప్ కిషన్ తన టీమ్ ని విజయవాడలో ముంపుకు గురయిన ప్రాంతాలకు పంపించి అక్కడి ప్రజలకు ఫుడ్, వాటర్ అందిస్తున్నారు. పలువురు యువత సుందీప్ కిషన్ టీమ్ లాగా అక్కడికి వెళ్లి స్వయంగా ఆహార పదార్థాలను అక్కడి ప్రజలకు అందిస్తున్నారు. IAS లక్ష్మీశ కూడా వీరిని అభినందించారు. దీంతో అభిమానులు, నెటిజన్లు సుందీప్ కిషన్ ని అభినందిస్తున్నారు.
తన టీంతో బాధితులకు ఫుడ్ వాటర్ సప్లై..
