కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు..

kagriwall-13.jpg

ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఉపశమనం లభించింది. ఈ స్కాంకు సంబంధించిన కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తిని చాలాకాలం పాటు నిర్బంధించడం అంటే వాళ్ల హక్కులను హరించినట్లే. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టు సరైందే అయినప్పటికీ అరెస్టు చేసిన టైం మాత్రం కరెక్టు కాదు. ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీ వ్యక్తికి ‘బెయిల్ అనేది నిబంధన జైలు మినహాయింపు’గా ఉండాలి అని మరోసారి వ్యాఖ్యానించింది.

Share this post

scroll to top