అన్ స్టాపబుల్ షోలో తమిళ సూపర్ స్టార్..

unstubale-24-.jpg

అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ – 4 లో మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ ను షూట్ కంప్లిట్ చేసారు మేకర్స్. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఎపిసోడ్ కూడా ముగించారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌ షో సీజన్ – 4 లో పాల్గొనబోతున్నారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య  ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు.

అన్‌స్టాపబుల్ షో లో సందడి చేసేందుకు సూర్య ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసారు. సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం. సూర్య సినీ జర్నీ విశేషాలతో పాటు సూర్య జ్యోతిక ప్రేమ విషయాలను బాలయ్యతో పంచుకోనున్నాడు సూర్య. అలాగే కంగువ తెలుగు ప్రమోషన్స్ ను అన్‌స్టాపబుల్ వేదికపై నుండి మొదలెట్టనున్నాడు సూర్య.

Share this post

scroll to top