టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది..

ind-vs-sa-29.jpg

 బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తుది పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ విజయంతో దక్షిణాఫ్రికా మొదటిసారి ప్రపంచకప్ ను గెలుచుకుంటుందో లేకపోతే టీమిండియా రెండోసారి టి20 ప్రపంచ కప్పును గెలుచుకుంటుందా..? అనేది రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్ తో తేలిపోతుంది. ఇకపోతే ఐపిఎల్ 17వ సీజన్లో అత్యధిక స్కోరు సాధించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో నిలిచే కోహ్లీ ఆశ్చర్యకరంగా ఈ సీజన్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక బంగ్లాదేశ్ పై చేసిన 37 పరుగులను మినహాయిస్తే అన్ని మ్యాచ్ లలోను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. ఇక తన స్థాయి ఆటను ఫైనల్లో చూపితేనే టీమిండియాకు మరోసారి వరల్డ్ కప్ అందనుంది. ఇక మిగతా టీం విషయానికి వస్తే సమిష్టి ప్రదర్శనలతో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. ముఖ్యంగా బౌలింగ్ యూనిట్లో మంచి ప్రదర్శన చేయడం వల్ల టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. ముఖ్యంగా బూమ్ర ప్రతి మ్యాచ్ లోను పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా కీలక వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుకు కళ్లెం వేయగలిగారు. ముఖ్యంగా పాకిస్తాన్ పై 120 పరుగుల లక్ష్యాన్ని కూడా కట్టడి చేశారంటే దానికి కారణం బూమ్రానే. బూమ్రాతో పాటు మరో బౌలర్ హర్ష దీప్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ.. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా సీరిస్ లో కొనసాగుతున్నాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే.. కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వారికి తగ్గ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అనుకున్న దానికంటే ఎక్కువగా ఆడుతున్నాడు. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో తుది జట్లను ఈ విధంగా అంచనా వేయవచ్చు.

Share this post

scroll to top