మీడియాపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు..

kadapa-13.jpg

కడపలో ఉద్రిక్తత నెలకొంది మీడియాపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. కడప జిల్లా వేముల మండలంలో హై టెన్షన్‌ నెలకొంది. నీటి పన్ను కట్టకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటారని, కవర్ రేజ్ చేస్తున్న మీడియా పై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. ఈ తరుణంలోనే వేముల తాసిల్దార్ కార్యాలయం చేరుకున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కడప కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరన్నారు.

సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ వాళ్లు పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. నీటి పన్ను కట్టించుకోకుండా అధికారులు తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఇక ఎన్నికలు ఎందుకు మీరే ఏకగ్రీవంగా ప్రకటించుకోవచ్చు కదా అని కలెక్టర్ ను నిలదీశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ తరునంలోనే సాక్షి టీవీ రిపోర్టర్, కెమెరామెన్ పై టిడిపి కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేసినట్లు చెబుతున్నారు. దీంతో కడపలో ఉద్రిక్తత నెలకొంది.

Share this post

scroll to top