టీడీపీ కూటమి హ‌వా.. వందకుపైగా సీట్లలో టీడీపీ ఆధిక్యం

kutami-ad.jpg

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి హ‌వా కొన‌సాగుతోంది. వందకుపై సీట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంటే.. జనసేన 21 సీట్లలో, బీజేపీ ఐదు స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. అటు అధికార వైసీపీ బాగా వెనుక‌బ‌డింది. కేవ‌లం 20 స్థానాల్లో మాత్ర‌మే ముందంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం టీడీపీ సింగిల్‌గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ దిశగా ప‌య‌నిస్తోంది.

రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్య‌ర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 25 వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గుమ్మనూరి జయరామ్ గుంతకల్లులో 600 ఓట్ల ముందంజ‌లో ఉన్నారు. పిఠాపురంలో జ‌న‌సేనాని ఆధిక్యం 10 వేలు దాటింది. కుప్పంలో చంద్రబాబు 5 వేలకుపైగా ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్ రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి 8 వేలకుపైగా ఓట్ల‌ ఆధిక్యంలో ఉన్నారు.

Share this post

scroll to top