ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ లీగల్‌సెల్ విభాగంతో వైఎస్ జగన్ సమావేశమై మాట్లాడారు. టీడీపీ నేతలు రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నారని, ఎవరిని తొక్కాలి, ఎవరిపైకేసులు పెట్టాలి, ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలని అందులో రాసుకున్నారని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ తెరవడం మొదలుపెట్టారని, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిల్లో రెడ్ బుక్ ల పేరిట విధ్వంసాలు చేస్తున్నారని అన్నారు. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోసిస్తున్నారని ఆరోపించారు. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారని, వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పారు.
వీటి గురించే రెడ్ బుక్‌లో రాసుకున్నారు..
