వివాదాస్పద నేత రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. ఆయన నిత్యం వివాదాలతో సావాసం చేస్తూనే ఉంటారు. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన. ఉన్నపలంగా రఘురామ కృష్ణంరాజులో ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు జగన్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం జగన్ గురించి రఘురామ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాదాస్పద నేత రఘురామ కృష్ణంరాజులో మార్పు..
