తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమావేశానికి సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ట్వీట్‌పై టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందంటూ బొత్స ట్వీట్ చేశారు. దీనిపై అమర్నాథ్ స్పందిస్తూ.. ‘‘ఆవేశపడకు బొత్సా.. అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు.. మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా అప్పనంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదు.. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తాని చెప్పిన మాటలు మర్చిపోలేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆవేశపడకు బొత్సా.. అమర్నాథ్ కౌంటర్
