ఎంపీలు మంత్రులతో నేడు సీఎం చంద్రబాబు నాయుడు తాడేపల్లిలో సమావేశం..

jagan-20.jpg

నేడు సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు భేటీ కానున్నారు. ఇక, ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధుల ప్రస్తావన పార్లమెంట్‌లో తేవాలని తమ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు జరిపిన ఢిల్లీ పర్యటనల్లో ఇచ్చిన వినతులపై ఫాలో అప్ చేసేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంది టీడీపీపీ. ఢిల్లీలో ధర్నాకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సిద్దపడుతోన్నందున్న.. కౌంటర్లను సిద్ధం చేసుకునే అంశంపై టీడీపీ కసరత్తు చేస్తోంది. జగన్ హయాంలో జరిగిన అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది..

Share this post

scroll to top