తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక ప్రెస్‌నోట్‌లా అనిపించిందని వ్యాఖ్యానించారు. ఆయన గవర్నర్ ప్రసంగాన్ని గాంధీభవన్ ప్రెస్‌మీట్ లా ఉందని ఎద్దేవా చేశారు. గత 15 నెలల కాలంలో ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని, అసెంబ్లీ సమావేశాల్లో సుతారంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గవర్నర్ ప్రసంగం ప్రెస్‌మీట్‌లాగా ఉంది..
