తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. పార్టీకి కొత్త సారధి రాకతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అధిష్టానం అనుమతికోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. మొన్నటి వరకు జోడు పదవులతో బిజీబిజీగా ఉన్న రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా మహేశ్ గౌడ్ ఎంపిక కావడంతో పార్టీ బాధ్యతల నుంచి రేవంత్ ఫ్రీ అయ్యారు. ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. కేబినెట్ విస్తరణకు సామాజిక కూర్పులో భాగంగా పీసీసీ చీఫ్ ఎవరు అవుతారన్నది ముడిపడి ఉండటంతో తర్జనభర్జన తరువాత బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్ కు హైకమాండ్ ఆమోదం తెలిపింది. దీంతో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగం పుంజుకుంది.
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం..
