తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి, సత్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలిసేందుకు రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం కేరళకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి రాత్రి దేశ రాజధానికి చేరుకున్నారు. జూన్ 2న నిర్వహించనున్న ఉత్సవాలకు రావాల్సిందిగా సోనియా గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఆహ్వానించనున్నారు.
ఢిల్లీలో రేవంత్ రెడ్డి.. సోనియాను కలవనున్న తెలంగాణ సీఎం
