తెలంగాణలో అంతర్జాతీయ పారిశ్రామలు..

cm-ravanth-3.jpg

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. రేపు మంత్రి శ్రీధర్ బాబు, ఎల్లుండి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమెరికాకు వెళ్తారు. అమెరికాలో పలు నగరాల్లో పర్యటించి మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం, మంత్రులు సమావేశం అవుతారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలకు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పెద్దఎత్తున విదేశీ కంపెనీల ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యంగా మూసీ ఆధునికీకరణ లాంటి ప్రాజెక్టుల విషయంలో విదేశీ సంస్థల సాయం ఉండాలని అనుకుంటున్నారు.

Share this post

scroll to top