సామాన్యులకు మేలు కలిగే మరో ప్లాన్ రచించారు. నెలకు కేవలం రూ.300 లకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కలిశారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
సామాన్యులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్..
