సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. 

hyd-2-1.jpg

కేబినెట్ సమవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని గ్రామాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీని రెండు కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ఎక్కువ భాగం ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని 23 గ్రామాలను సమీప మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం చేసి అనంతరం వాటిని జీహెచ్‌ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి ఒకే కార్పొరేషన్‌‌గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Share this post

scroll to top