నగరం నడిబొడ్డున ఉన్న మూసీ నది పేరు వినపడితే ఇప్పుడు ముక్కు మూసుకుంటాం. కానీ ఒకప్పుడు ఈ నది భాగ్యనగర వాసుల దూప తీర్చింది. నల్లగొండ జిల్లాలో కొన్ని వందల ఎకరాలను తడిపి పంటలకు ప్రాణం పోసింది. ఒకప్పుడు జీవనదిగా ఉన్న మూసి కాలక్రమేణా తన ప్రభవాన్ని కోల్పోసాగింది. హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి మూసీని మురికి కూపంగా మార్చింది. నగరంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, డ్రైనేజీ వాటర్ కలిసి మూసీని మురికి నదిగా మార్చాయి. ఆ పరిసరాల్లో తిరగాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. అంతలా నది నాశనం అయ్యింది. అయితే మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు సిద్ధమైన విషయం తెలిసిందే. మూసీ ప్రక్షాళన కోసం ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిచింది. మూసీ నదికి ఇరువైపులా అందమైన పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి టూరిస్ట్‌గా హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మూసీ నది ప్రక్షాళనకు సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం గుండా వెళ్లే అందమైన చియోంగీచియాన్ నదిని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు.
రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన..
