తెలంగాణ హైకోర్టు మరోసారి మరోసారి హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పనితీరు అశాజనకంగా లేదని బుధవారం హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అని నిలదీసింది. మియాపూర్, దుర్గంచెరువు ఆక్రమణల పరిస్థితి ఏంటి? అందరికీ ఒకేలా న్యాయం జరిగితే హైడ్రా ఏర్పాటుకు సార్థకత ఉంటుందని చెప్పుకొచ్చారు న్యాయమూర్తి. తహసీల్దార్ నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా అనే మహిళ హైకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణ జరిగింది. ఈ కేసులో హైకోర్టు హైడ్రాకు చురకలు అంటించింది. గతంలో కూడా హైకోర్టు హైడ్రా పేదల ఇళ్లు మాత్రమే కూల్చడంపై అసహనం వ్యక్తం చేసింది.
హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా..
