నోటీసులివ్వకుండా కూల్చివేతలేంటి..

high-court-14-.jpg

 తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన జీవో 99 ను సవాల్​ చేస్తూ హైదరాబాద్ నానక్​రాంగూడకు చెందిన డి.లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం ఐలాపూర్‌లో 19.27 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చి వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా జీవో 99 తీసుకువచ్చిందని, ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలన్నారు.

Share this post

scroll to top