బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

ktr-23.jpg

కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో కేటాయింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికికూడా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. కానీ, తెలంగాణకు దక్కింది శూన్యం. రూ. 48లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని కేటీఆర్ అన్నారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదని కేటీఆర్ అన్నారు. ఐఐఎం సహా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ నుంచి ముంబై – నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

Share this post

scroll to top