టీ20 ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంది. నేడు జరగనున్న సెమీస్-2లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. 2022 సెమీస్‌లోనూ ఇంగ్లాండ్‌తోనే ఆడిన భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌పై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. కూల్‌గా ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడడంపైనే దృష్టి సారించామని మీడియా సమావేశంలో తెలిపాడు. పరిస్థితులేమీ మారలేదు. చివరి వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో తలపడినప్పటితో పోలిస్తే పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదని రోహిత్ అన్నాడు. 2014 తర్వాత ఆడిన ఐసీసీ టోర్నీల్లో భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ఒత్తిడితో పాటు అదృష్టం కలిసిరాకపోవడం కూడా కారణమని వివరించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే సెమీస్‌ను ఒక సాధారణ మ్యాచ్‌లాగే భావించనున్నట్లు తెలిపాడు. ఏ సందర్భంలో ఆడుతున్నాం? మున్ముందు పరిస్థితేంటి? అనే అంశాలను అసలు పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరికీ ఇది సెమీ-ఫైనల్ గేమ్ అని తెలిసినప్పటికీ.. దాని గురించి పదే పదే ఆలోచించబోమని వివరించాడు. జట్టులో ప్రతిఒక్కరూ ఇదే ధోరణితో ఉన్నారని వెల్లడించాడు. అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించాడు.
అలా ఆడడంపైనే మా దృష్టి.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌పై కెప్టెన్ రోహిత్
