తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్నారు. వైకుంఠ క్యూకాంప్లెక్స్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ అధికారి హరీంద్రనాథ్ స్వాగతం పలికారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనాలు అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందించారు.
దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయన్నారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి కాంక్షించారు.