బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

bandi-19.jpg

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని, నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. సచివాలయం వద్ద రోజులా వాహనాల రాకపోకలు ఉండటంతో ఈ గందరగోళం మధ్య ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడ్డాయి. భారీ ట్రాఫిక్‌ జాం కావడంతో పోలీసుటు ఇటు నిరసనకారులను, అటు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసే పనిలో పడ్డారు. అంతకు ముందు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలచుకుందా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిపట్టు వీడాలని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, హైకోర్టు తీర్పును గౌరవించాల్సిందే అని బండి సంజయ్‌ అన్నారు.

Share this post

scroll to top