పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్, జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహరవీరమల్లు. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను ఏఎమ్ రత్రం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘హరిహరవీరమల్లు’ భారీ అంచనాల మధ్య ఫస్ట్ పార్ట్ జూన్ 12న థియేటర్స్‌లోకి రానుంది.
దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా, ‘హరిహరవీరమల్లు’ సినిమా నుంచి మూడో పాట విడుదల చేసింది చిత్రబృందం. ‘అసుర హననం’ అని సాగే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. పవన్‌పై పోరాట సన్నివేశాలతో చిత్రీకరించిన సీన్స్ అన్ని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇక ఈ మూవీస్ షూటింగ్ సగానికి పైగా పూర్తవగా కొంత మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ‘హరి హర వీరమల్లు’ ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి చేయనున్నారు.