శాసన సభా పక్ష సమావేశం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కమిటీ హాల్‌లో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన మన అనే విషయాన్ని కూడా చూడను. నన్నే జైలుకు పంపారు. కక్ష సాధింపు చేయాలనుకుంటే నేనూ చేయగలను. కానీ కక్ష సాధింపు వ్యవహరాన్ని నేను పట్టించుకోవడం లేదు అని అన్నారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాలేదు.. అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారు. జగన్ సహా వైసీపీ సభ్యులు ఫ్రస్ట్రేషనులో ఉన్నారని అన్నారు. విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. అయితే ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దని ఆయన సూచించగా ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తెలిపారు. మూడు పార్టీల మధ్య కో-ఆర్డినేషన్ అంశాన్ని ప్రస్తావించిన నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. పోలీస్ యంత్రాంగం సరిగా స్పందించడంలేదు. డబ్బుల్లేవని పనులు చేయలేం అని చెప్పలేం. నిధులతో ఇబ్బందులున్నా పనులు చేయాలి. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదాం.” అని ఆయన పేర్కొన్నారు.
మూడు పార్టీల మధ్య కో-ఆర్డినేషన్ లేదు..
