బెదిరించి బాలికపై గ్యాంగ్ రేప్..

gang-22.jpg

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస లైంగికదాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం బాలికను ఓ యువకుడు లోబర్చుకోవాలనుకున్నాడు. దానికి అతడి స్నేహితులు సహకరించారు. బాధిత బాలిక తన ఇంటికి సమీపంలోని ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతున్నప్పుడు వీడియో తీశారు. దాన్ని చూపించి బెదిరించారు. తాము చెప్పినట్లు వినకపోతే ఆ వీడియోను అందరికీ చూపిస్తామని, బాలిక ఇంట్లోని తల్లిదండ్రులకు చూపిస్తామని భయపెట్టించారు. ఈ క్రమంలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఈ ఘటన పై బాలిక తండ్రి నిన్న మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Share this post

scroll to top