హ్యాపీ బర్త్‌డే మై హ్యాండ్ సమ్ మ్యాన్..

meharien-31-.jpg

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత F2, F3 సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందని వెల్లడించింది. అయితే అప్పడు ఫుల్ బక్కచిక్కి పోయి కనిపించి అయ్యో పాపం అనిపించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి గ్లామరస్‌గా తయారవుతుంది.

సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ఓ ముసలి వ్యక్తితో ఉన్న ఫొటో షేర్ చేస్తూ హ్యాపియెస్ట్ బర్త్‌డే మై డియర్ హ్యాండ్‌సమ్ మ్యాన్ మిస్ యూ అనే క్యాప్షన్ రాసుకొస్తూ రెడ్ హార్ట్ లవ్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Share this post

scroll to top