ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు..

andra-10.jpg

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఎప్పటి నుంచో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలో అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ మహిళలకు కూడా కల్పిస్తామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ రెండు రాష్ట్రాల్లో అమలు అవుతున్న మాదిరిగా ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. వీటిపై సంబంధిత అధికారులు ఇప్పటికే నివేదికలను తయారు చేసి సీఎం చేతికి అందించారు. వాటిపై రివ్యూ నిర్వహించిన ప్రభుత్వం దీని అమలు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటిస్తారన్నారు. ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లు తెలిపారు.

Share this post

scroll to top