బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లల్లో జాన్వీ కపూర్ ఒకరు. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటన అందంతో ఆకట్టుకుంది. దీంతో హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా ఈ అమ్మడు ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక బాలీవుడ్ సంగతి పక్కన పెడితే గత ఏడాది ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది జాన్వీ. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌ను అందుకోలేక పోయిన జాన్వీ ఈ చిత్రంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దెబ్బతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో అమ్మడుకి తెలుగులో వరుస ఆఫర్లు లైన్ కడుతున్నాయి. కాగా ప్రస్తుతం జాన్వీ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC 16’ మూవీ లో రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక నేడు జాన్వీ కపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి జాన్వీపై ఒక సింపుల్ పిక్‌ని సెట్స్ నుంచి షేర్ చేశారు. బర్త్ డే విషెస్ చెబుతూ తన రోల్ టెర్రిఫిక్‌గా ఉండబోతుంది అంటూ రివీల్ చేసాడు దర్శకుడు బుచ్చిబాబు. అలాగే ఆడియెన్స్‌కి మీ రోల్‌ని చూపించడానికి చాలా వెయిట్ కూడా చేస్తున్నాను అంటూ తెలిపాడు. అంటే దీని బట్టి ఈ సినిమాలో జాన్వీకి సాలిడ్ రోల్ దక్కేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీస్ నిర్మిస్తున్నారు.