లడ్డూ కల్తీపై విచారణ వాయిదా..

thirupathi-03.jpg

తిరుమల లడ్డూ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో పాటు పలువురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. లడ్డూ వివాదంపై దర్యాప్తునకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతను విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ సమయం కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10.30కు విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా గత విచారణలో ఏపీ ప్రభుత్వం, టీటీడీపై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా లడ్డూ ప్రసాదంపై వ్యాఖ్యలు చేయడం కోట్లాదిమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లడ్డూ రాజకీయాల్లోకి లాగొద్దంటూ సీరియస్‌గా చెప్పింది.

Share this post

scroll to top