ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చాయని వ్యాఖ్యానించారు. పోలింగ్‌కు ముందు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని, 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నామని వెల్లడించారు. వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులను మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జగన్ కలిశారు. ఎన్నికల ఫలితాలపై వారితో చర్చించిన సందర్భంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ఫలితాలపై వైసీపీ అభ్యర్థుల వద్ద మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
