మీ కళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

eys-22.jpg

వర్షాకాలం అనగానే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఈ సీజన్‌లో వ్యాధులు దండయాత్ర చేస్తుంటాయి. ఇక ఈ వర్షాకాలంలో గాలిలో తేమ స్థాయిలు గణనీయంగా పెరిగిపోతాయి. దీని వలన అలెర్జీ, ఇన్ ఫెక్షన్స్, దగ్గు, జ్వరం వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన వైద్యులు ఈ సీజన్‌లో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ఇక ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు రావడం చాలా కామన్. కానీ ఈ సీజన్ కంటిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. కండ్లకలక, స్టై, ఫంగల్ కంటి ఇన్ఫెక్షన్స్, కార్నియల్ అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కండ్లకలక : వర్షాకాలంలో చాలా మంది వేధించే కంటి సమస్యల్లో కండ్లకలక ఒకటి. ఇది ఈ సీజన్‌లో సర్వ సాధారణం. ఇది ఒక అంటువ్యాధి. దీని వలన కన్ను ఎర్రగా మారడం, నీరు కారడం, నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

కార్నియల్ అల్సర్ : కార్నియల్ అల్సర్ అనేది కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్. ఈ సీజన్‌లో ఇది ఎక్కువగా రావచ్చును. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేస్తున్న వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అకస్మాత్తుగా కంటి నొప్పి, కన్ను ఎర్రగా మారడం, నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 అలెర్జీ : దుమ్ము, మేకప్ కిట్, వాతావరణ మార్పులు, కాంటాక్ట్ లెన్స్ ధరించే వారు అలెర్జీ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్య రాకూడదు అంటే తప్పని సరిగా సన్ గ్లాసెస్ ధరించాలి. అది దుమ్ము మన కంటిలో చేరకుండా కాపాడుతుంది. ఓవర్ ది కౌంటర్ స్టెరాయిడ్ కంటి చుక్కలు అస్సలే వాడకూడదు. ఇది దృష్టిలో మార్పులను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.

Share this post

scroll to top