గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు కనిపించే లక్షణాలు ఇవే..

hart-attick-11.jpg

ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి ఛాతీ మధ్యలో ఒత్తిడి, బిగుతు లేదా నొప్పి ఉండవచ్చు, ఇది కొన్ని నిమిషాలు లేదా ఎక్కువసేపు ఉండవచ్చు. సాధారణంగా ఎడమ చేతిలో నొప్పి మొదలై రెండు చేతులకూ పాకవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఊపిరి తీసుకోవడంలో ఆటంకం కలగడం లేదా శ్వాస ఆడకపోవడం, అన్నటికంటే ముఖ్యంగా ఛాతీ నొప్పితో కలిసి వస్తే. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అలసట లేదా బలహీనత అసాధారణమైన అలసట, శరీరం బలహీనంగా అనిపించడం, ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది.

నేషనల్ హార్ట్, బ్లడ్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం పురుషుల కంటే మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. చేయి, భుజం లేదా దవడలో నొప్పి: ఛాతీ నుండి ఎడమ చేయి, భుజం లేదా దవడ వైపు వ్యాపించే నొప్పి లేదా అసౌకర్యం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. వికారం లేదా చెమటలు కడుపులో అసౌకర్యం, వాంతులు వచ్చేలా ఉండటం లేదా చల్లని చెమటలు పట్టడం వంటివి కూడా గుండె పోటుకు సంకేతాలు అని చెప్పవచ్చు.

Share this post

scroll to top