నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. సెప్టెంబర్ 27న థియేటర్లో మాస్ జాతరకు రెడీ అవుతున్న టైగర్ ఫ్యాన్స్.. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ పండగ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్న ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ‘దేవర’ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ పాల్గొనే అవకాశం ఉంది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు వినిపించాయి. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి క్లారీటీ లేదు. తాజాగా మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఈవెంట్‌కి ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ గెస్ట్‌లుగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అతిథులుగా హాజరు కాబోతున్నారట. రాజమౌళి, ఎన్టీఆర్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్‌కు గ్లోబల్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఘనత జక్కన్నదే. ఇక అరవింద సమేత తర్వాత మరోసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. దాంతో త్రివిక్రమ్ ప్లేస్‌లో కొరటాల ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్రివిక్రమ్ గెస్ట్‌గా వస్తుండడం విశేషం.