ఏపీ సీఎం చంద్రబాబుపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న దాటాక బోడి మల్లన్న’ అనే సామెతను తలపిస్తోందని ట్విటర్‌లో ఆరోపించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని దుయ్యబట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుందని బాబు వ్యవహారముందని ఆరోపించారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ? సూపర్ సిక్స్ హామీలు అమలుకు ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని ? తెలియదా అంటూ ప్రశ్నించారు.