పదేళ్ల కిందట వచ్చిన మహేష్ ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. ‘ఆవ్ తుజొ మోగ్ కోర్తా’ అంటూ యూత్‌తో పిచ్చ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అదే ఏడాది హిందీలో హీరోపంతి సినిమాతో నార్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో నార్త్‌లో కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక ఆ మరుసటి ఏడాది అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్‌లు రాలేదు. దాంతో ఈ సొగసరి ముంబైకి షిప్ట్ అయిపోయింది. దోచెయ్ తర్వాత ఫుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే పెట్టింది. ఇక బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి బాగా కలిసొచ్చింది. హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ వరకు చేరుకుంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మూడేళ్ల కిందట వచ్చిన ‘మిమీ’తో ఏకంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఆ సినిమాలో సరోగేట్ మదర్‌గా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఇక ఆ బ్యూటీ బర్త్‌డే ఈరోజు. దాంతో సోషల్ మీడియాలో మొత్తం బర్త్‌డే పోస్ట్‌లతో నిండిపోయింది. ఇక ఈ బ్యూటీ ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్తుల విలువ వంద కోట్లకు పైమాటే అట. అంతేకాకుండా కృతి సనన్ ఒక్కో సినిమా రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
కృతి సనన్ ఆస్తులు 100 కోట్లకు పైమాటే..
