ప్రతి రోజూ ఈ ఆకుకూర 21 గ్రాములు తింటే చాలు..

helth-15.jpg

కాలేలో ఆరు రకాల విటమిన్స్ ఉంటాయి. దీని నుంచి విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ B2, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. లింఫోసైట్స్, ఫాగోసైట్స్ అని పిలిచే తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాలేలో ఆరు రకాల విటమిన్స్ ఉంటాయి. దీని నుంచి విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ B2, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. లింఫోసైట్స్, ఫాగోసైట్స్ అని పిలిచే తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

కాలే ఆకుకూర క్యాబేజీ కుటుంబానికి సంబంధించినది. బ్రకోలీ, కాలీఫ్లవర్, కొల్లార్డ్ గ్రీన్స్ వంటివి క్యాబేజీకి సంబంధించిన కూరగాయాలు. ఒక కప్పు లేదా 21 గ్రాముల ముడి కాలేలో కార్బోహైడ్రేట్స్ ఒక గ్రాము, ఫైబర్ ఒక గ్రాము, విటమిన్ కె డైలీ వ్యాల్వూ లో 68 శాతం, విటమిన్ సీ రోజువారీ అవసరాల్లో కాలే నుంచి 22 శాతం పొందవచ్చు. మాంగనీస్ 8శాతం, విటమిన్ ఎ 6 శాతం, రిబోఫ్లావిన్ 5 శాతం, కాల్షియం 4 శాతం పొందవచ్చు. కాలేలోని కొన్ని పోషకాలు జీర్ణవ్యవస్థలో పిత్త ఆమ్లాలను బంధిస్తాయి. రక్తప్రవాహంలో తిరిగి గ్రహించకుండా నిరోధిస్తాయి. దీని ఫలితంగా శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దీన్ని పౌడర్ చేసుకొని వాడినా ఫలితం ఉంటుంది. 8 వారాల పాటు ప్రతిరోజూ 14 గ్రాముల కాలే పౌడర్ ఆహారంలో యాడ్ చేసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ చాలా వరకు తగ్గుతాయి. అలాగే రక్తపోటు, బెల్లీ ఫ్యాట్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

Share this post

scroll to top