రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని ఆయన కారణంగానే వైయస్ఆర్‌సీపీ కార్యకర్త, బీసీ నేత కురుబ లింగమయ్య హత్యకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఎస్సై సుధాకరే కారణం ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం వైయస్ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. వైయస్ జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా? పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా? అసలు ఎస్సై సుధాకర్ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా? నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు? టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది? అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు.