తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోగా ఈ సమయంలో తిరుమల వెంకన్న దర్శనానికి సిద్ధం అయ్యారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీంతో ఇప్పుడు తిరుమల ఆలయంలో వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇష్యూ తెరపైకి వచ్చింది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమికి చెందిన మంత్రులు, నేతలు డిమాండ్ చేస్తు్న్నారు. ఇక, దీనిపై స్పందించిన మాజీ ఎంపీ వంగా గీత మీరు చేస్తున్న ఆరోపణలు నిజాలు అని నిరూపిస్తే వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తారని పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ విషయంలో చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవుడితో ఆటలు వద్దు అని హెచ్చరించారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వం ఇటువంటి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు వంగా గీత.
సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్..
