అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఆదివారం, శ్రీవారిని దర్శనానికి జనం ఎక్కవ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. ఆదివారం వారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తుల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.
ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. సోమవారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల వేచి చూస్తున్నారు.