నేడు సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఉదయం 10:30 కు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. 12 :10 కి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మెడికవర్ హాస్పిటల్, వెంకోజిపాలెంకు చేరుకోనున్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి, వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి సాయంత్రం నాలుగున్నరకు చంద్రబాబు చేరుకోనున్నారు.
నేడు అచ్యుతాపురానికి చంద్రబాబు..
