నీ పని ఇలానే కొనసాగించు’ నెటిజన్‌కు హరీశ్ శంకర్ రిప్లై..

ravi-teja-11.jpg

మాస్ మహరాజా రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను హరీశ్‌ శంకర్ డైరెక్షన్‌లో‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సితార్‌ అంటూ సాగే సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అయితే ఈ సాంగ్‌పై నెటిజన్స్‌ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్లను కేవలం ఓ వస్తువులాగే చూపిస్తారని మండిపడుతున్నారు. 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్యశ్రీతో అలాంటి స్టెప్స్ వేయింటడమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్‌ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

Share this post

scroll to top