మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి సీఎం దిశానిర్దేశం..

tdp-12-.jpg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి పార్టీ నుంచి అనేకమంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బుధవారానికి సభను వాయిదా వేశారు. ఇందులో భాగంగా నేడు సీఎం చంద్రబాబు నాయుడు కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేల కు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. శిక్షణా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరును వివరించారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ పై అవగాహన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Share this post

scroll to top