ఏపీలో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఆగస్ట్ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసమే ఆగస్టులో చేపట్టాల్సిన రెవెన్యూ సదస్సుల్ని కూడా సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా వేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై త్వరలోనే జీవో వెలువడే అవకాశం ఉంది. అయితే అన్ని విభాగాల్లోనే కాకుండా కొన్ని ఎంపిక చేసిన డిపార్టుమెంట్ లలో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ , గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖలతో పాటుగా సచివాలయాల ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ..
