ఇకపై వారికి రేషన్ పంపిణీ అక్కడే మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు..

reshion-25.jpg

గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సంధ్యా రాణి సమావేశం నిర్వహించారు. గుమ్మిడి సంధ్యా రాణి గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 9 ఐటీడీఏల్లో అభివృద్ధి, సంక్షేమంపై సమాచారం తీసుకున్నానన్నారు. 554 ట్రైబల్ స్కూల్స్‎లో ANMలను నియమించి ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఫీడర్ అంబులెన్స్, తల్లి బిడ్డ ఎక్స్‎ప్రెస్ వ్యాన్స్ ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ నియామకాల్లో గిరిజన ప్రాంతాలకు భారీగా ఉపాధ్యాయులు రానున్నాట్లు ఈ సమావేశం అనంతరం తెలిపారు. గిరిజనుల సౌలభ్యం కోసం రేషన్ షాపుల దగ్గరే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. GCC ఉత్పత్తులు, అరకు కాఫీని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గిరిజన విద్యార్థుల మరణాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగుతో పాటు, అక్రమ రవాణా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు యద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బయట అందుబాటులో ఉండే టీ టైమ్ షాపుల మాదిరిగా అరకు కాఫీ షాపులు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కార్పొరేషన్ ద్వారా ఈ కాఫీ షాపుల నిర్వహణ చేపట్టాలన్నారు.

Share this post

scroll to top