శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదు..

ttd-23.jpg

తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లలో నాణ్యత తగ్గినట్లు గుర్తించి ఆ నెయ్యిని ఉపయోగించలేదని జంతు, వెజిటెబుల్‌ కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ నుంచి నివేదిక రావడంతో ట్యాంకర్లను వెనక్కి పంపించేశామని తెలిపారు. కాగా, తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు. బాబును గట్టిగా మందలించాలని, అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని వస్తున్న ఆరోపణలపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని వస్తున్న ఆరోపణలపై సిట్‌తో విచారణకు ఆదేశించాలని కోరుతూ రైతు, హిందూ సేన అధ్యక్షుడు అయిన సుర్జీత్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న జరుగుతున్న ప్రచారం హిందువులను తీవ్రంగా కదిలించిందని, వారి విశ్వాసం, మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు.

Share this post

scroll to top