ఐపీఎస్‌ పీఎస్సార్‌ అరెస్ట్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..

arun-kumar-05.jpg

సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై సీనియర్‌ రాజకీయ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం విజయవాడ జైలుకు వెళ్లి పీఎస్ఆర్ ను కలిసి వచ్చానని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పీఎస్ఆర్ పై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదు ఇచ్చిందని , ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో విచారణ ఎలా ప్రారంభిస్తారు? అని ప్రశ్నించారు. పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. తాను మరి కొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పీఎస్ఆర్ నాతో చెప్పారని అన్నారు. ఈ కేసు కు సంబంధించి ముంబైలో పూర్తి సమాచారాన్ని సేకరించి త్వరలో మరోసారి మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు ఉండవల్లి అరుణ్‌ కుమార్.

ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదన్నారు ఉండవల్లి. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు అని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాము పబ్లిక్ మీటింగ్‌లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు లెటర్ రాశాను. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని చెప్పాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్‌సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదన్నారు. గతంలో పవన్ కల్యాణ్‌ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారని గుర్తుచేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌.

Share this post

scroll to top