రేపు ఏపీ పర్యటనకు అమిత్‌ షా..

amith-17.jpg

ఏపీ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రానున్నారు. రేపు రాత్రి 9:10కి సీఎం చంద్రబాబు వద్దకు అమిత్ షా రానున్నారు. డిన్నర్ మీటింగ్ లో సీఎం, కేంద్ర హోంమంత్రి కలుస్తారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇక రేపు రాత్రికి‌ విజయవాడ నోవాటెల్ లో అమిత్ షా బస చేస్తారు. ఎల్లుండు గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే NDRF 20వ వ్యవస్ధాపక దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరు కానున్నారు.

ముందుగా NIDM క్యాంపస్ ను ప్రారంభించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాకకు 700 మంది బిజెపి కార్యకర్తలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశ ప్రాంగణంలో 1200 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటలపాటు జరగనుంది ఈ సమావేశం. ఈ సమావేశం అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పయనం అవుతారు.

Share this post

scroll to top