నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం

tdp-17.jpg

రాష్ట్రంలోని TDPలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం నెలకొంది. ఈ నెలలో కొన్ని పదవులను భర్తీ చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానీ తర్వాత కానీ ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే ప్రజెంట్ ఆయా పార్టీలకు ఏఏ పదవులివ్వాలి? టీడీపీ నేతలతో వేటిని భర్తీ చేయాలన్నదానిపై కూడా అంతర్గతంగా కసరత్తు నడుస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమైన కార్పొరేషన్లు సుమారు వంద, అలాగే కుల వృత్తుల ఫెడరేషన్లు 60 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కేటాయించనున్నారు. ఈ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Share this post

scroll to top